Monday, May 29, 2017

రాగం : భైరవి - హరినామము కడు నానందకరము

రాగం : భైరవి - హరినామము కడు నానందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా

1 హరినామము కడు నానందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా
నళినాక్షు శ్రీనామము కలిదోషహరము కైవల్యము
ఫలసారము బహుబంధ మోచనము తలచవో తలచవో మనసా

2 నగధరు నామము నరకహరణము జగదేకహితము సమ్మతము
సగుణ నిర్గుణము సాక్షాత్కారము పొగడవో పొగడవో పొగడవో మనసా

3 కడగి శ్రీవేంకటపతి నామము ఒడి ఒడినే సంపత్కరము
అడియాలం బిల నతి సుఖమూలము తడవవో తడవవో తడవవో మనసా

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...