Thursday, June 1, 2017

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు
మా తల్లి లత్తుకకు నీరాజనం - కేంపైన నీరాజనం
- భక్తి పెంపైన నీరాజనం

చరణం: 1
యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి
బాగైన అందెలకు నీరాజనం - బంగారు నీరాజనం
- భక్తి పొంగారు నీరాజనం

చరణం : 2
నెలతాల్పు డెందాన వలపు వీణలు మీరు
మా తల్లి గాజులకు నీరాజనం - రాగాల నీరాజనం
- భక్తి తాళాల నీరాజనం

చరణం: 3
మానుజాళి హృదయాల తిమిరాలు సమయించు
మా తల్లి నవ్వులకు నీరాజనం - ముత్యాల నీరాజనం
- భక్తి నృత్యాల నీరాజనం

చరణం: 4
చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు
మా తల్లి ముంగురకు నీరాజనం - రతనాల నీరాజనం
- భక్తి జతనాల నీరాజనం

చరణం: 5
పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు
మా తల్లి చూపులకు నీరాజనం - అనురాగ నీరాజనం
- భక్తి కనురాగ నీరాజనం

చరణం: 6
దరహాస మనిపించు ఇనబింబ మనిపించు
మా తల్లి కుంకుమకు నీరాజనం - నిండైన నీరాజనం
- భక్తి మెండైన నీరాజనం

చరణం: 7
తేటిపిల్లల వోలె గాలి కల్లలలాడు
మా తల్లి కురులకు నీరాజనం - నీలాల నీరాజనం
- భక్తి భావాల నీరాజనం

చరణం: 8
జగదేక మోహిని, సర్వైక గేహిని
మా తల్లి రూపునకు నీరాజనం - నిలువెత్తు నీరాజనం
- భక్తి విలువెత్తు నీరాజనం

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...