Wednesday, May 31, 2017

నీ ఆత్మ నిశ్చలమైతే

నీ ఆత్మ నిశ్చలమైతే,
పరమాత్మ నిశ్చలమౌను ॥ నీ ఆత్మా ॥

పూలకు రంగులు ఉన్నవి కాని, పూజకు రంగులు ఉన్నాయా?
పూల వంటిదే నీ ఆత్మా
పూజ వంటిదే పరమాత్మ ॥ నీ ఆత్మా ॥

ఆలకు రంగులు ఉన్నవి కాని, పాలకు రంగులు ఉన్నాయా ?
ఆలవంటిదే నీ ఆత్మా,
పాల వంటిదే పరమాత్మ ॥ నీ ఆత్మా ॥

ఏటికి వంపులు ఉన్నవి కాని, నీటికి వంపులు ఉన్నాయా ?
ఏటి వంటిది నీ ఆత్మా ,
నీటి వంటిదే పరమాత్మా ॥ నీ ఆత్మా ॥

భజనకు రీతులు ఉన్నవి కానీ, భక్తి కి రీతులు ఉన్నాయా?
భజన్ వంటిదే నీ ఆత్మా
భక్తి వంటిదే పరమాత్మ ॥ నీ ఆత్మా ॥

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...