Wednesday, May 31, 2017

మరువకే మనసా మాధవా నామము

మరువకే మనసా మాధవా నామము
మాధవ నామము మంజుల గానము ॥ మరువకే ॥

అస్తిరమగు ఈ మాయా ప్రపంచము,
సుస్తిరమని మది చూడ బొకుమీ ॥ మరువకే ॥

ఈ ధర నిహపరా సాధన మూలము ,
సాధన చేసిన నరులకు మోక్షము ॥ మరువకే ॥

ధన దాన్యములు కల్గినగాని,
ధారా సుతాదులు ముల్గిన గాని ॥మరువకే ॥

కష్టము లెన్నియు కల్గిన గాని ,
కండలు దండలు కలిగిన గాని ॥ మరువకే ॥

ధరమళయాళ గురువరు గొల్చిన,
వరదాసుని వాక్యము గైణని ॥ మరువకే ॥

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...