సాయిబాబా నా మనసే
సాయిబాబా నా మనసే నీ మజిలి కావాలి
సద్గురు సాయి బ్రతుకే నీకు హారతి కావాలి -- సాయి బాబా --
నిత్యం నినే తిలకించే ఒక దీపం కావాలి,
నీ నామాన్నే జపియించే ఒక రాగం కావాలి,
నువ్వు చరియించే తారకే నే ద్వారం కావాలి,
నిన్ను అభిషేకించే వేడుకలోనే క్షీరం కావాలి -- సాయి బాబా --
నా తనువు అణువు అడుగడుగునా నీకు అర్పణ కావాలి,
నా భక్తి శ్రద్ధ నేనిచ్చే గురు దక్షిణ కావాలి,
నా అండగా ఉండే అనుదినము నీ రక్షణ కావాలి,
నీవే ఉండగా భయమే లేదని భావన రావాలి -- సాయి బాబా --
No comments:
Post a Comment