Monday, May 29, 2017

చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మోవికి చాంగుభళా

చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మోవికి చాంగుభళా

చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మోవికి చాంగుభళా

కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు జూపులకు చాంగుభళా
పలుకుల సొంపుల బతితో గసరెడి చలముల యలుకకు చాంగుభళా

కిన్నెరతో పతి కెలన నిలుచు తన చన్ను మెఱుగులకు చాంగుభళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుభళా

జందెపు ముత్యపు సరులహారముల చందన గంధికి చాంగుభళా
విందయి వెంకట విభుబెన చినతన సంది దండలకు చాంగుభళా

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...