Tuesday, May 30, 2017

రాగం : సౌరాష్ట్ర- భజనఁజేసే విధము తెలియండి


రాగం : సౌరాష్ట్ర భజనఁజేసే విధము తెలియండి - జనులార మీరు


భజనఁజేసే విధము తెలియండి - జనులార మీరు
నిజము గనుగొని మోదమందండి

భజనఁజేసే విధము దెలియక -
నిజముగా హరిభక్తులనుకొని మద
గజముఁ దెగవ్రేయలేకయు -
సుజనులని తిరుగంగ నేలను

వారు వీరని యెంచబోకండి - నరులార మీరు
నోరు చచ్చినవారు కాకండి
వారు వీరని యెంచుటెల్లను
సారము లేనట్టి హీనత
పౌరుషులకే గాక పుణ్య
ధారి కథలం దేమి యున్నది?

జ్ఞాను లనుకొని యెగసి పడకండి - జనులార తత్త్వ
జ్ఞానమందే మనసు నిలపండి
జ్ఞాను లనుకొని యెగసిపడి య
జ్ఞానములు పైఁ బెట్టుకొనినను
మానసంబునఁ బుట్టి చచ్చియుఁ
బూని మరి జన్మింప వలయును

ఝూట మాటలాడఁ బోకండి - నరులార కలియుగ
నాటకములోఁ జిక్కబోకండి
ఝూట మాటలాడి పొట్ట
కూటికి వేషములు దాల్చుక
మాటికి యమబాధలచేఁ
గాటికి బోవంగ నేటికి

మూలస్థానముఁ దెలిసి బ్రతుకండి - జనులార మీరు
మేలిమిగ శ్రీహరిని వెదకండి
మూలస్థానముఁ దెలిసి మీలో
జాలగా వెలిగేటి జ్యోతిలో
లీలమై వెలుగొందు బాలుని
నీలమధ్యమునందు దలచుక

ధరను శ్రీనరహరిని గొలువండి - జనులార మీరు
పరమపదవిని బొందగోరండి
ధరను శ్రీఘటికాద్రి నరహరి
పరమభక్తవరుల మనుకొని
విరివిగా నరసింహదాసుని
వరకవిత్వము సార మనుకొని

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...