రాగం : కేదారగౌళ - సువ్వి సువ్వి సువ్వి సువ్వని
సువ్వి సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెద రోలాల
వనితలు మనసులు కుందెన చేసిటు వలపులు తగనించోలాల
కనుచూపు లనెడు రోకండ్లను కన్నెలు దంచెద రోలాల
బంగరు చెరుగుల పట్టు పుట్టములు కొంగులు దూలగ నోలాల
అంగనలందరు నతివేడుకతో సంగడి దంచెద రోలాల
కురులు దూలగ మంచి గుబ్బచనులపై సరులు దూలాడగ నోలాల
అరవిరి బాగుల నతివలు ముద్దులు గురియుచు దంచెద రోలాల
ఘల్లు ఘల్లుమను కంకణరవముల పల్లవపాణుల నోలాల
అల్లన నడుములు అసియాడుచు సతు లొల్లనె దంచెద రోలాల
కప్పురగంధులు కమ్మనిపువ్వుల చప్పరములలో నోలాల
తెప్పలుగా రతి దేలుచు గోనేటప్పని బాడెద రోలాల

No comments:
Post a Comment