Friday, June 2, 2017

శ్రీకాళహస్తీశ్వరా... హరహర

శ్రీకాళహస్తీశ్వరా... హరహర
కరుణించి నను బ్రోవరా... దేవర.. కైవల్య పదమీయరా ...
చరణం 1:
ఆలయమన్నది లేదని నీకై అల్లెను గుడులను సాలీడు
ఆ భక్తుడు నీవు సంశోధించ అగ్నిపరీక్షను పొందాడు
నీ గుడి రూపము చెరిపిన దీపము మ్రింగ దలంచెను పురుగు
ఆ భక్తికి ఎంతో రక్తిని చెంది ముక్తినొసంగిన దేవా... !!శ్రీకాళహస్తీశ్వరా!!
చరణం 2:
పన్నగ మొక్కటి ప్రతి ఉదయమ్మున ఎన్నో మణులను తెచ్చేదీ .. నిన్నే పూజించేదీ
పాముయొనర్చిన పూజను మెచ్చక ఏనుగు దానిని తుడిచేదీ .. వేరే పూజలు చేసేదీ
ఒకరు యెనర్చిన పూజలునొల్లని కరికాళమ్ములు పగబూనీ .. తరుణము కొరకై వేచినవీ
తొండము నుండి దూరిన పాము మెండుగ గజమును బాధించే
కొండను మోదగ కుంభము పగులగ రెండొకతరి మరణించె
నీకై పోరిన ఆ ప్రాణులకు నీ సాయుజ్యము లభియించే
జంతుసంతతికి ఇచ్చిన మోక్షము సదాశివా ... దయచేయవా... !!శ్రీకాళహస్తీశ్వరా!!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...