Thursday, June 1, 2017

శివరంజని - శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా

శివరంజని - శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా


శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా

చెలువుమీర పంచవటి సీమలో
తమ కొలువు సేయ సౌమిత్రీ ప్రేమతో
తన కొలువు తీరె రాఘవుడూ భామతో..!! శ్రీరాముని  !!
చరణం 1 :
రాముగని ప్రేమగొనే రావణు చెల్లీ
ముకు చెవులు కోసె సౌమిత్రీ రోసిల్లీ
రావణుడామాట విని పంతము పూనీ
మైథిలినీ కొనిపోయే మాయలు పన్నీ ..!! శ్రీరాముని  !!

చరణం 2 :
రఘుపతిని రవిసుతునీ కలిపెను హనుమా
నృపుజేసెను సుగ్రీవుని రామవచన మహిమా
ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపులా
హనుమంతుడు లంకజేరి వెదకెను నలుదిశలా..!! శ్రీరాముని  !!

ఆ... నాథా .... రఘునాథా.... పాహి పాహి...
పాహి అని అశోకవనిని శోకించే సీత
పాహి అని అశోకవనిని శోకించే సీత
దరికి జెని ముద్రికనిడి తెలిపె విభుని వార్త
ఆ జనని శిరోమణి అందుకొని పావనీ
ఆ జనని శిరోమణి అందుకొని పావనీ
లంక కాల్చి రాముని కడకేగెను రివురివ్వుమని ..!! శ్రీరాముని  !!
చరణం 3 :
దశరథసూనుడు లంకను డాసి దశకంటు తలను కోసి
దశరధసూనుడు లంకను డాసి దశకంటు తలను కోసి
ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే
చేరవచ్చు ఇల్లాలిని చూసీ శీలపరీక్షను కోరె రఘుపతీ
అయోనిజ పైనే అనుమానమా...
ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరిక్షా....

పతి ఆనతి తలదాలిచి అగ్నిదూకె సీతా
పతి ఆనతి తలదాలిచి అగ్నిదూకె సీతా
కుతవాహుడు చల్లబడి సాధించెను మాతా
కుతవాహుడు చల్లబడి సాధించెను మాతా
సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత ..!! శ్రీరాముని  !!
శ్రీరాఘవం దశరాథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం.. అరవింద దళాయతాక్షం
రామం.. నిశాచర వినాశకరం.. నమామీ!!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...