Tuesday, June 6, 2017

కళావతి : పిలిచిన పలికేవు తల్లి అమ్మా దుర్గమ్మా

కళావతి : పిలిచిన  పలికేవు తల్లి అమ్మా  దుర్గమ్మా 

పిలిచిన  పలికేవు తల్లి అమ్మా  దుర్గమ్మా
 పిలిచిన  పలికేవు తల్లి

1. కంచిలోన కామాక్షమ్మ
మధురలోన మీనాక్షమ్మ
కలకత్తాలో కాళీమాతా
మము దయచూడుము తల్లీ
అమ్మా దుర్గమ్మా  !!పిలిచిన పలికేవు !!

2. కాండ్రకోట నూకాళమ్మ
పెద్దాపురమున ఓ మరిడమ్మా
లోవలోన తలుపులమ్మా
మము దయచూడుము తల్లీ
అమ్మా దుర్గమ్మా  !!పిలిచిన పలికేవు !!

3. కాంతులు చూపే కన్నులలోనా
కన్నీరే నింపావా
పువ్వులలోన వాసన చూపి
పురుగులు నింపావా   !!పిలిచిన పలికేవు !!

4. మనిషిని చేసి మనస్సు పోసి
మలినమునే  నింపావా
వేడుకచేసి వేదికచేసి
వేదన జేసే వేమి అమ్మ దుర్గమ్మా !!పిలిచిన పలికేవు !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...