భావములోన (అన్నమయ్య, రాగం శుద్ధ ధన్యాసి)
పల్లవి:
భావములోన భాహ్యములందును గోవింద గోవింద అని కోలువవో మనసా
చరణాలు:
హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు
హరి నామములే అన్ని మంత్రములు హరి హరి హరి హరి హరి అనవో మనస
విశ్ణుని మహిమలే విహిత కర్మములు విశ్ణుని పోగడేడి వేదంబులు
విశ్ణుడోక్కడే విశ్వాంతరాత్ముడు వీశ్ణువు విశ్ణువని వెదకవో మనస
అచ్యుతుడితడే ఆదియు అంత్యము అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుడు శ్రీ వేంకటాద్రీ మీదనితె అచ్యుత అచ్యుత శరణనవో మనస
No comments:
Post a Comment