అంబ నీకు ఇదిగో మంగళం
త్రికాలమందు దేవి నీకు ఇదిగో మంగళం
పంచాభూతములనేది పల్లెరములైదు చేసి
మించిన తత్వమందు వంచి జ్యోతి చేసినాను -- అంబ --
కొంచెపు గునములన్ని కోసి వత్తులు వేసినాను
సంచితార్ధమయినట్టి చమురు చాల పోసినాను -- అంబ --
పెద్దలనేటి శావ పెరుగు ఘటములోన బోసి
బుద్ది అనే కవ్వముతోడ రుద్ది వెన్న తీసినాను -- అంబ --
శుద్దమనే అగ్ని మీద సిద్దముగా కాచినాను
ఒద్దికగా పోసినాను ఓంకారి చూడవమ్మ -- అంబ --
పరులు అన్నలనుచు గురులసేవ చేసినాను
గురు సఖులకైన గురుని మరుగు తెలుపు తల్లి -- అంబ --
జ్ఞాన ధారణ చేసి దేవుడుందే స్తలము తెలిపి
ఆనవాలు కని నేను అన్ని చిత్రకలలు చూసినాను -- అంబ --
వెండికొండ మీద నున్న యోగ సిద్దురాలివమ్మ
దండిగాను పరమ శివుని దాపునున్చుకున్న తల్లి -- అంబ --
కారనమనేటి కరుణ చూపి యోగ పదవి దారి తెల్పి
కామాక్షమ్మ చేరతీయవమ్మ నన్ను విరట్లోకిని -- అంబ --
No comments:
Post a Comment