రాగం : మాల్ కోన్ -మనసే అందాల బృందావనం..
వేణు మాధవుని పేరే మధురామృతం..
కమ్మని నగుమోము.. కాంచుటే తొలినోము.
కమ్మని నగుమోము.. కాంచుటే తొలినోము.
కడకంటి చూపైన కడుపావనం...
రాధను ఒక వంక లాలించునే..
సత్య భామను మురిపాల తేలించునే..
మనసార నెరనమ్ము తనవారినే... ఆ.. ఆ..
మనసార నెరనమ్ము తనవారినే..
మనసార నెరనమ్ము తనవారినే... ఆ.. ఆ..
మనసార నెరనమ్ము తనవారినే..
కోటి మరులందు సుధలందు తనియింతునే...
No comments:
Post a Comment