Friday, June 2, 2017

దేవా దీనభాంధవా... అసహాయరాలరా కావరా

చిత్రం: పాండవ వనవాసం (1965)
దేవా దీనభాంధవా... అసహాయరాలరా కావరా
దేవా.. దీనభాంధవా... అసహాయరాలరా కావరా
దేవా... ఆ.. ఆ...

చరణం 1:

కాలుని అయినా కదనములోన గెలువజాలిన నా.. పతులు
కాలుని అయినా కదనములోన గెలువజాలిన నా.. పతులు
కర్మ బంధము త్రెంచగలేక.. మిన్నకుండేరు స్వామి
నిన్నే మదిలో నమ్ముకునేరా.. నీవే నా దిక్కు రా.. రా
దేవా దీనభాంధవా... అసహాయరాలరా కావరా
దేవా... ఆ.. ఆ

చరణం 2:

మకరి పాలై శరణము వేడిన కరిని కాపాడినావే
మకరి పాలై శరణము వేడిన కరిని కాపాడినావే
హిరణ్యకశిపు తామసమణచి ప్రహ్లాదు రక్షించినావే
కుమతులు చేసే ఘోరమునాపి
కుమతులు చేసే ఘోరమునాపి
కులసతి కాపాడలేవా

దేవా దీనభాంధవా... అసహాయరాలరా కావరా
దేవా.... గోవిందా.. గోపి జనప్రియా.... శరణాగత రక్షకా...
పాహిమాం... పాహి... పాహి... కృష్ణా

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...