Monday, May 29, 2017

వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి

వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి

వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో వెట్టిదేర మాటాడు విష్ణుమూరితి

వినయము సేసేవు విష్ణుమూరితి వెనకటి వాడవెగ విష్ణుమూరితి
వినవయ్యా మామాట విష్ణుమూరితి మమ్ము వెనుకొని పట్టకుమీ విష్ణుమూరితి

వెరపుగల వాడవు విష్ణుమూరితి నేడు వెరగైతి నిన్ను జూచి విష్ణుమూరితి
విరివాయె నీమాయలు విష్ణుమూరితి నాకు విరులిచ్చే వప్పటికి విష్ణుమూరితి

వెలసె నీ సేతలెల్ల విష్ణుమూరితి మా వెలుపలలోన నీవె విష్ణుమూరితి
వెలలేని శ్రీవేంకట విష్ణుమూరితి కూడి విలసిల్లితివి నాతో విష్ణుమూరితి

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...