Monday, May 29, 2017

రాగం : సౌరాష్ట్రం - వీధుల వీధుల విభుడేగేనిదె


రాగం : సౌరాష్ట్రం - వీధుల వీధుల విభుడేగేనిదె మోదము తోడుత మొక్కరో జనులు


వీధుల వీధుల విభుడేగేనిదె మోదము తోడుత మొక్కరో జనులు

గరుడ ధ్వజంబదె కనకరధంబదె అరదముపై హరి అలవాడే
ఇరుదెసలనున్నారు ఇందిరయు భువియు పరగ పగ్గములు పట్టరో జనులు

ఆడేరదివో అచ్చరలెల్లరు పాడేరు గంధర్వ పతులెల్ల
వేడుకతో వీడే విష్వక్సేనుడు కూడి ఇందరును కొలువరో జనులు

శ్రీ వేంకటపతి శిఖరముచాయదె భావింప బహువైభములవె
గోవింద నామపు ఘోషణలిడుచును దైవంబితడని తలచరో జనులు

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...