Monday, May 29, 2017

రాగం : ధన్నాసి- వీడె వీడె కూచున్నాడు

రాగం : ధన్నాసి- వీడె వీడె కూచున్నాడు వేడుకతో గద్దెమీద

వీడె వీడె కూచున్నాడు వేడుకతో గద్దెమీద వాడి ప్రతాపముతోడి వరదాన సింహము

అరయ ప్రహ్లాదుని ఆపదోద్ధార సింహము గిరిపై ఇందిరకును క్రీడా సింహము
నిరతి సురల భయనివారణ సింహము సరి హిరణ్యకశిపుసంహార సింహము

ఇట్టె విశ్వమునకు ఏలికైన సింహము గట్టిగ శరణాగతుల గాచే సింహము
దిట్టమై వేదాలలోని తెరవేట సింహము నెట్టుకొనిన దురితనివారణ సింహము

అంచెల మూడు మూర్తుల కాధారమైన సింహము పంచల మునుల భాగ్యఫల సింహము
పొంచి శ్రీవేంకటాద్రికి భూషణమైన సింహము చెంచుల అహోబలపు శ్రీనారసింహము

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...