Monday, May 29, 2017

రాగం : భూపాళం - విన్నపాలు వినవలె

రాగం : భూపాళం - విన్నపాలు వినవలె వింత వింతలు 


విన్నపాలు వినవలె వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్తవేళయ్యా

తెల్లవారె జామెక్కె దేవతలు మునులు అల్లనల్ల నంతనింత నదిగోవారే
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా

గరుడ కిన్నరయక్ష కామినులు గములై విరహపు గీతముల వింతాలాపాల
పరిపరివిధముల బాడేరునిన్నదివో సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా

పొంకపు శేషాదులు తుంబురునారదాదులు పంకజభవాదులు నీ పాదాలు చేరి
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...