Monday, May 29, 2017

రాగం : దేవగాంధారి - వినరో భాగ్యము విష్ణుకథ


రాగం : దేవగాంధారి - వినరో భాగ్యము విష్ణుకథ

వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణు కథ

ఆదినుండి సంధ్యాదివిధులలో వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే వీదివీధులనే విష్ణుకథ

వదలక వేదవ్యాసులు నుడిగిన విదితపావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్థనయై వెదకినచోటనే విష్ణుకథ

గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ వెల్లవిరియాయ విష్ణుకథ
యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము వెల్లిగొలిపె నీవిష్ణుకథ

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...