Monday, May 29, 2017

వాడె వేంకటేశుడనేవాడె వీడు

వాడె వేంకటేశుడనేవాడె వీడు


వాడె వేంకటేశుడనేవాడె వీడు వాడిచుట్టుగైదువవలచేతివాడు

కారిమారసుతుని చక్కనిమాటలకు జొక్కి చీరగా వేదాలగుట్టు చూపినవాడు
తీరని వేడుకతో తిరుమంగయాళువారి ఆరడిముచ్చిమికూటి కాసపడ్డవాడు

పెరియాళువారిబిడ్డ పిసికి పైవేసిన విరులదండల మెడవేసినవాడు
తరుణి చేయివేసిన దగ్గరి బుజముచాచి పరవశమై చొక్కి పాయలేనివాడు

పామరుల దనమీది పాటలెల్లా బాడుమంటా భూమికెల్లా నోర నూరిపోసినవాడు
మామకూతురల మేలుమంగనాచారియు దాను గీముగానే వేంకటగిరి నుండేవాడు

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...