Monday, May 29, 2017

రాగం : శ్రీ రాగం - వాడల వాడల


రాగం : శ్రీ రాగం - వాడల వాడల వెంట వాడెవో 

వాడల వాడల వెంట వాడెవో నీడ నుండి చీరలమ్మే నేత బేహారి

పంచ భూతములనెడి పలు వన్నె నూలు చంచలపు గంజి తోడ చరి నేసి
కొంచపు కండెల నూలి గుణముల నేసి మంచి మంచి చీరలమ్మే మారు బేహారి

మటుమాయముల దన మగువ పసిడి నీరు చిటిపోటి యలుకల చిలికించగా
కుటిలంపు చేతలు కుచ్చులుగా గట్టి పటవాళి చీరలమ్మే బలు బేహారి

మచ్చిక జీవుల పెద్ద మైల సంతల లోన వెచ్చపు కర్మ ధనము విలువ చేసి
పచ్చడాలుగా కుట్టి బలువెంకటపతి ఇచ్చ కొలదుల అమ్మే ఇంటి బేహారి

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...