Sunday, May 14, 2017

గిన్నిస్‌ రికార్డుల లో మన హిందూ దేవాలయం

గిన్నిస్‌ రికార్డుల లో మన హిందూ దేవాలయం , ఇది లండన్ లో నీస్ డెన్ అనే ఊర్లో ఇండియన్స్ ఎక్కువగా ఉండే ప్లేస్ లో ఉంది . ఆ ఆలయాన్ని గుజరాతీయులు 109 కోట్లతో లండన్ లో స్వామి నారాయణమందిర్ 14ఏళ్ల శ్రమించి 2.4 ఎకరాల్లో నిర్మించారు
ఆలయం ఎత్తు 66 అడుగులు. . మందిర నిర్మాణంలో స్టీల్‌ను వాడకపోవడం విశేషం. ఈ మందిరంలో మతాలకు అతీతంగా 41 మంది పాలరాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇందులో మదర్‌ థెరెసా, గురునానక్‌, మీరాబాయి, స్వామినారాయణ్‌ తదితరుల విగ్రహాలున్నాయి.స్వామి నారాయణ్ గుజరాతీయుల గురువు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం అది ఉండదు . చాల క్లీన్ గా ఉంటుంది. ఆలయం లోపల ఎక్కడి కక్కడ వాలెంటీర్స్ ఉంటారు. మౌనంగా వెళ్లి అంతా దర్శించుకొని వెళ్లి రావాలి .ఒక మ్యూజియం చూసినట్లు ఉంటుంది ఆలయం బయట ఒక కాంటీన్ ఉంది . అక్కడ గుజరాతీ ఫుడ్ అమ్ముతారు. దీపావళి ని పురస్కరించుకొని ఎదో ఒక వీకెండ్లో బాణాసంచా కాలుస్తారు.
ప్రపంచవ్యాప్తంగా 4000 పైచిలుకు శ్రీ స్వామినారాయణ ఆలయాలు ఉన్నాయి . కొన్ని కోట్లమంది స్వామినారాయణ్ భక్తులు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు.
ఈయన గురువు శ్రీ రామానందస్వామి ప్రధానంగా గుజరాత్ రాష్ట్రంలోని వివిధ పట్టణాలలో, గ్రామాలలో పర్యటిస్తూ లక్షలాదిమంది మనసులలో ధృడమయిన దైవభక్తిని, ఆధ్యాత్మిక భావనలను పెంపొందించారు స్వామి నారాయణ్ . భారత దేశమంతటా కాలినడకన 12 వేల కిలోమీటర్లు పర్యటించారు. ఈ యాత్రను పూర్తిచేయడానికి ఆయనకు సుమారు 7 సంవత్సరాల ఒక నెల 13 రోజులు పట్టింది. వీరి ఆధ్యాత్మిక ప్రయాణం ఉత్తరాదిన హిమాలయాల నుండి దక్షిణాదిన కన్యాకుమారి వరకు, ఇటు తూర్పు నుండి పడమరవరకు మొత్తం భారత దేశ పర్యటన చేసారు.బీడీ, చుట్ట, గంజాయి, చిలుము తాగడం వంటి వ్యసనాల బారిన పడిన లక్షలాదిమందిని విముక్తుల్ని చేసారు. మద్యమాంసాలను సేవించే వారిని కూడా మార్చగలిగారు. అంతేకాక సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు ముఖ్యంగా స్త్రీ, భ్రూణ హత్యలు, సతీ సహగమనం, బాల్యవివాహాలు వంటివి నిర్మూలించారు. ఆయన ఖ్యాతి గుజరాత్ ను దాటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర మరియు అనేక ఇతర ప్రాంతాలలో కూడా వ్యాపించింది. ప్రజలందరి చేత వారు భగవాన్ శ్రీ స్వామినారాయణ్ గా సాక్షాత్తు నరనారాయణ అవతారంగా కీర్తింపబడ్డారు,

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...