రాగం : ఆనందభైరవి - :పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీనామ స్మరణ మరువ చక్కని తండ్రి !!పలుకే బంగారమాయెనా !!
ఇరువుగ నిసుకలోన బొరలిన యుడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి !!పలుకే బంగారమాయెనా!!
రాతి నాతిగజేసి భూతలమందున ప్ర
ఖ్యాతిజెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి !!పలుకే బంగారమాయెనా!!..
ఎంతవేడినను నీకు సుంతైన దయరాదు
పంతముచేయ నేనెంతటివాడను తండ్రి !!పలుకే బంగారమాయెనా!!
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా
కరుణించు భద్రాచల వరరామ దాసపోష !!పలుకే బంగారమాయెనా!!
No comments:
Post a Comment