రాగం : కల్యాణి - ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి
ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి
ననుబ్రోవమని చెప్పవే నారీశిరోమణి
జనకుని కూతుర జనని జానకమ్మ!!ననుబ్రోవమని!!
ప్రక్కను చేరుక చెక్కిలి నొక్కుచు
చక్కగ మరుకేళి సొక్కుచుండెడి వేళ !!ననుబ్రోవమని!!
ఏకాంతరంగుడు శ్రీకాంత నినుగూడి
ఏకాంతమున నేకశయ్యనున్న వేళ !!ననుబ్రోవమని!!
అద్రిజవినుతుడు భద్రగిరీశుడు
నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి !!ననుబ్రోవమని!!
No comments:
Post a Comment