Wednesday, May 31, 2017

హర, హర, హర, హర, మహాదేవా


హర, హర, హర, హర, మహాదేవా

హర, హర, హర, హర, మహాదేవా
శివ, శివ, శివ, శివ సదాశివా

నందివాహనా నాగాభరణా
గంగాధరా హర, జటాధరా
శ్రీశైలవాసా శ్రీమల్లికార్జున
భ్రమరాంబా ప్రియ మనోహరా
మనోహరా, మహాదేవా !!హర, హర!!


కాలకాలహర, సదా శివా
కాశీవిశ్వేశ్వర సదా శివా
సదాశివ, మహాదేవా
రారా శివ, రావా శివా !!హర, హర!!

రత్నాల మేడ దిగి, రావా శివా
ముత్యాల మేడ దిగి, రావా శివా
కొండా కొండలు దిగి, రావా శివా
వెండి కొండలు దిగి, రావా శివా
రా రా శివా, రావా శివా


డం, డం, డం, డం, డమరు భజే
భం, భం, భం, భం పశుపతే
ఘణ, ఘణ, ఘణ, ఘణ ఘంటాభజే
భోలనాథ ఉమాపతే
ఉమాపతే, పశుపతే !!హర, హర!!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...