సాయినాథ ప్రభో కావరావా
సాయినాథ ప్రభో కావరావా
దీనబంధు దయా చుపలేవా
నిన్ను శరణంటి కరుణించలేవా
నీదు భక్తులను కాపాడరావా !!సాయినాథ ప్రభో!!
నా....డు తత్యాను కరుణించలేదా
నన్ను కాపాడ ఈ.... జాలమేలా
నీదు పాదాలు శరణంటి సాయి
నాదు మొరనీకు వినిపించ లేదా !!సాయినాథ ప్రభో!!
కా...మా క్రోధాత వర్ణాలు నన్ను
నిలువ లేకుండా చేసెను నేడు
నాదు క్రోధమ్ము తొలగించలేవా
నీదు పాదాలా దరి చేర్చరావా !!సాయినాథ ప్రభో!!
No comments:
Post a Comment