Monday, May 15, 2017

ఈ పగలు రేయిగా -రేయిని పగలుగ

పల్లవి : ఈ పగలు రేయిగా -రేయిని పగలుగ
మార్చిందీనీవు కాళీకృష్ణ  నీ మహిమే
వింతకాదు ఈ జగతిని చూచిరి
మాయలో పడిరీ జనం - నిన్ను మరచితిరీ జనం
1.కలలు గన్న ఈ జగమంతయును
కనుమరుగయ్యెను ఒకనాడు ఆహా ఓహో ఆ ఆ ఆ
కనుమరుగేనని తెలిసిన జనులు
మాయనుండి విడిపోలేదు !! మాయలో పడిరీ జనం
2. ఆలి సుతులు ఇల అన్నదమ్ములు
వెంటరాదని నమ్మేరు ఆహా ఓహో ఆ ఆ ఆ
వెంటరాదని నమ్మిన జనులే
మాయనుండి విడిపోలేదు !! మాయలో పడిరీ జనం
3. ధనదాహములో పడిన జనులు
ఈ ధర్మమంతయు మరిచారు ఆహా ఓహో ఆ ఆ ఆ
ధనమే సర్వం కాదని తెలిసినా
మాయనుండి విడిపోలేదు !! మాయలో పడిరీ జనం
4.అందమైన ఈ సుందర దేహం
క్షణకాలమని తలచేరు ఆహా ఓహో ఆ ఆ ఆ
క్షణకాలమని తలచిన జనులే
మాయనుండి విడిపోలేదు !! మాయలో పడిరీ జనం






No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...