Tuesday, May 30, 2017

రాగం : కాఫీ - దొరవలె గూరుచున్నాఁడు


రాగం : కాఫీ - దొరవలె గూరుచున్నాఁడు


 దొరవలె గూరుచున్నాఁడు
 భద్రగిరి నాథు డితఁ డేమొ చూడు
మెఱుపైన చామంతి విరులదండలు చాలముఱియుచు
ధరియించి ముదిత సీతను గూడి
పురుమంజి ముత్యాల సరులు కెంపుల తాళి
మెఱయుచు నుండగఁ జిరునవ్వు మొగముతో
కాంచనచేలముఁ గనక కిరీటము
లాంఛనములు గల లక్ష్మణాగ్రజుఁడిదె
విరుల చప్పరమునఁ బరమ భక్తులు గొల్వ
నరసింహదాసుని నరసి ప్రోచుఁటకు

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...