Tuesday, May 30, 2017

రాగం : నవరోజు - జోజో రఘూత్తంస జో పద్మనాభా

రాగం : నవరోజు - జోజో రఘూత్తంస జో పద్మనాభా

జోజో రఘూత్తంస జో పద్మనాభా
జో మైథిలీనాథ జో రామచంద్రా

జో లక్ష్మణాగ్రజ జో కామజనక
జో భక్తవత్సల జో శేషతల్ప

మేలిబంగరు రత్నడోలిక ఘటించి
జాళువాముత్యాల జాలరు ఘటించి

నీలవర్ణుడ వనుచు ని న్నందు నుంచి
లాలి యని యూతు రిదె లలనలును మించి

జలకములు పోసి యలకను దీర్చి నుదుట
దిలక మమరగ బెట్టి తెలిగలువతేట

జిలుకుచును ముకురముల గలప్రభలు మీటఁ
జెలులు పాటలఁ బాడఁ జేరి రిచ్చోట

ముంగురులు దువ్వి రంగుగ జుంచు కట్టి
రంగు బంగరు రావిరే కమరఁ గట్టి

శృంగారముగ ముద్దు టుంగరము బెట్టి
అంగనలు నిదుర బుచ్చెదరు జోకొట్టి

కూరిమిగ భద్రాద్రి శ్రీపురవిహారా
తీరుగా గౌతమీతీరమున మీర

ధారుణీసుత గూడి కోరికలు దీర
చేరి నిదురించుమీ శ్రీరామధీరా

ప్రేమమీరగ తూము నరసింహునితో
వేమారు నాటపాటల మరగి తెంతో

నేమమున వాఁడు నిన్నే మఱిగి నెంతో
కోమలాకార నిదురించు జానకితో

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...