రాగం : ఆనందభైరవి - నిద్రాముద్రాంకింతమైన
నిద్రాముద్రాంకింతమైన కన్నుల నీటుఁ జూడ గల్గెను
అనుపల్లవి:భద్రాద్రి నిలయ నాపాలి దైవమ రామ
భద్ర సీతామనఃపద్మభృంగ నీదు
తళుకు ముంగురులచేఁ దిలకము మెఱయగ
తళుకు ముంగురులచేఁ దిలకము మెఱయగ
కలికిచూపులు గుల్కగా
వలనొప్పుగా చంద్రవదనమందున నవ్వు మొలకలెత్తగ
వలనొప్పుగా చంద్రవదనమందున నవ్వు మొలకలెత్తగ
ముద్దు ముఱియుచుండెడు నీదు
మదనుని విల్లన మహిమ దీపించు నీ మంచి కన్బొమలతీరు
మదనుని విల్లన మహిమ దీపించు నీ మంచి కన్బొమలతీరు
సదమలమైన నీ చక్కని చెక్కిళ్ళు మొదలు మేఘముబోలు
మృదుగాత్రమున నీదు
మృదుగాత్రమున నీదు
వరహేమ మకుట పావనకుండలంబులు వైజయంతికమాలలు
కఱుకు బంగరుచేలకాంతులు దీపింప
కఱుకు బంగరుచేలకాంతులు దీపింప
నరసింహదాసు డేమరక సేవించు నీ
No comments:
Post a Comment