Wednesday, May 31, 2017

రాగం : తోడి - మట్టిని చేసావా మట్టిబొమ్మను చేసావా

రాగం : తోడి - మట్టిని చేసావా - మట్టిబొమ్మను చేసావా 

మట్టిని చేసావా - మట్టిబొమ్మను చేసావా
ప్రాణము పోసావా ప్రభో మనిషిగ  చేసావా

1. తల్లి గర్భమున నన్ను తొమ్మిది మాసాలుంచావా
పిమ్మట భూలోకానికి పంపి గాలి లోన కలిపేసావా !!  మట్టిని చేసావా !!

2. కూటికి పేదనిపించావు - కులములో నన్ను ఎంచావు
పిమ్మట భూలోకానికి పంపి మట్టిలో కలిపేసావా !!  మట్టిని చేసావా !!

3. కోటికి పడఁగెత్తించావు - కోటలెన్నో కట్టించావు
పిమ్మట భూలోకానికి పంపి  పూవు లాగ తెంచేశావా !!  మట్టిని చేసావా !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...