రాగం : మోహన లాహిరి లాహిరి లాహిరిలో
లాహిరి లాహిరి లాహిరిలో వరస :: ఆది తాళం శ్రీ రంగని పాట
పండరి పురమున శ్రీరంగా. .
పలుకవు ఏలా ఓ రంగా ..
శ్రీ రంగా ఓ రంగా ..ఆ... ఆ... ఆ... ఆ ... ఆ ... || పండరి పురమున ||
1. అల వైకుంఠము నీ వే నంటా
అయోధ్య వాసివి నీ వంటా
మనువులు తనువులు , నీ వే నంటా
మాధవ నిన్నే రమ్మంటా ... || పండరి పురమున ||
2. పురాణ పురుషుడు నీ వే నంటా
ప్రకృతీ పురుషుడు నీ వంటా
ముల్లోకమ్ములు , నీ వే నంటా
ముర హర శ్రీ హర రమ్మంటా ... || పండరి పురమున ||
No comments:
Post a Comment