రాగం : లలిత -- తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు
తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు
మోతనీటి మడుగులో యీతగరచినవాడు పాతగిలే నూతిక్రింద బాయనివాడు
మూతిదోసిపట్టి మంటిముద్ద పెల్లగించువాడు రోతయైన పేగుల పేరులు గలవాడు
కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు బూడిద బూసినవాని బుద్ధులవాడు
మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు దూడల నావులగాచి దొరయైనవాడు
ఆకసానబారే వూరి అతివల మానముల కాకుసేయువాడు తురగముపైవాడు
ఏకమై వేంకటగిరి నిందిరారమణి గూడి యేకాలముబాయని యెనలేనివాడు
No comments:
Post a Comment