Monday, May 29, 2017

రాగం : బౌలి - తిరువీధుల మెరసీ దేవదేవుడు

రాగం : బౌలి - తిరువీధుల మెరసీ దేవదేవుడు

తిరువీధుల మెరసీ దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను

తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు సిరుల రెండవనాడు శేషుని మీద
మురిపాల మూడవనాడు ముత్యాల పందిరిక్రింద పొరినాలుగవనాడు పువ్వు గోవిలలోను

గ్రక్కున నైదవనాడు గరుడునిమీద యెక్కెను నారవనాడు యేనుగుమీద
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను యిక్కువ దేరును గుర్రమెనిమిదవనాడు

కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు పెనచి పదోనాడు పెండ్లిపీట
యెనసి శ్రీవేంకటేశు డింతి యలమేల్మంగతో వనితల నడుమను వాహనాలమీదను

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...