రాగం : ఎమెన్ - అన్ని మంత్రములు
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ...
వెన్నతో నాకు గలిగే వేంకటేశు మంత్రము ..!!అన్ని మంత్రములు!!
1. నారదుడు జపియించె నారాయణ మంత్రము
చేరే ప్రహ్లాదుడు శ్రీ నారసింహ మంత్రము ..... "నారదుడు"
కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము ..
వేరే నాకు గలిగే వేంకటేశు మంత్రము ..... !!అన్ని మంత్రములు!!
2. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపియించె
అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు .
ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించే
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము!!అన్ని మంత్రములు!!
3. ఇన్ని మంత్రములకెల్లా ఇందిరా నాథుడే గురి
పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము ...."ఇన్ని"
నన్నుగావగలిగెబో నాకు గురుడియ్యగాను ...
వెన్నెల వంటిది శ్రీ వేంకటేశు మంత్రము ..!!అన్ని మంత్రములు!!

No comments:
Post a Comment