Monday, May 29, 2017

రాగం : నీలాంబరి -- నీలకందర దేవా దీనబంధవా

రాగం : నీలాంబరి --  నీలకందర దేవా దీనబంధవా 

జయ జయ మహాదేవా... శంభో సదాశివా... 
ఆశ్రిత మందారా శృతిశికర సంచారా.... 

నీలకందర దేవా దీనబంధవా రారా మమ్ముగావరా... 2
సత్యసుందరా స్వామీ నిత్యనిర్మల పాహీ ... 2                          "నీలకందరా"

అన్యదైవమూ కొలువా... అ.. అ..  
అన్యదైవమూ కొలువా...  నీదు పాదమూ విడువా ... "అన్య"
దర్శనమ్మునీరా మంగళాంగా గంగాధరా .. 2                            "నీలకందర"

దెహియన వరములిడు దానగుణసీమా ... 
పాహియన్నను ముక్తినిడు పరంధామా.. 
నీమమున నీ దివ్య నామసంస్మరణా ... 
ఏమరక చేయుదువు భావతాపహరణ ... 
నీదయామయ దృష్టి దురితముల్లారా .. 
వరసుధావృష్టి నా వాంఛ నీవెరా.. 
కరుణించు పరమేశ ధరహాసబాసా ... 
హరహహర మహాదేవ కైలాస వాసా ...కైలాస వాసా.. 
ఫాలలోచన నాదు మొరవిని దారిని పూనవాయా .. 
నాగభూషణ నన్ను కావగ జాగును చెయకయా..
.కనులవిందుగ భక్తవత్సల కానగరావయ్యా కనులవిందుగ భక్తవత్సల కానగరావయ్యా..
ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా..
ఫాలలోచన నాదు మొరవిని దారిని పూనవాయా ..

శంకరా శివశంకరా అభయంకరా.. శంకరా శివశంకరా అభయంకరా.. 
శంకరా శివశంకరా అభయంకరా.. .................... 

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...