Sunday, May 14, 2017

శ్రీ కాళీ కృష్ణ ఆశ్రమం , విజయవాడ

శ్రీ కాళీ కృష్ణ ఆశ్రమం , విజయవాడ లో ఒక అసాధారణమైన మహిమలు కలిగిన సద్గురు శక్తి పీఠం . ఈ పీఠాన్ని చేరుకోవటానికి , బస్సు, ఆటోల సౌకర్యం ఉన్నది .
ఇక్కడ ప్రతీ సంవత్సరం వైశాఖ పున్నమి రొజు న స్వామి వారి కల్యాణ మహోత్సవం ఎంతో శోభాయమానంగా అత్యంత కోలాహలంగా జరుగుతుంది. వాటితో పాటు ‘అన్న’ సంతర్పణలు విరివిగా జరుగుతాయి. కార్తిక పున్నమి పర్వదినం, శ్రీ గురుదేవుల పుట్టిన రోజు కూడా కావటం ఎంతో విశేషం. భక్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఈ సంబరాలలో పాలు పంచుకొని శ్రీ గురుదేవులైన భగవన్ శ్రీ శ్రీ శ్రీ వేంకట సుబ్బారావు కాళీ కృష్ణ గురు మహారాజ్ గారి దివ్య ఆశీస్సులు పొందుతూ ఉంటారు. శ్రీ గురుదేవులు సాక్షాత్తూ శ్రీ కాళీమాత ప్రత్యక్ష స్వరూపమని భక్తులు విశ్వసిస్తారు. శ్రీ గురుదేవులు అపారమైన దివ్యశక్తి సంపన్నులు, కాలచక్ర మర్మాలను తెలుసుకోగల సిద్ధ పురుషులు. పలు సంధర్భాలలో, , ప్రకృతి అనుకూలంగాలేని సమయాలలో, ఆ ప్రకృతిని కూడా తమకు అనుకూలంగా మార్పు చేసి చూపించిన మహిమాన్వితులు శ్రీ గురుదేవులు.

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...