Sunday, May 14, 2017

కాపులపాలెం సుబ్రమణ్యదేవాలయం

కాపులపాలెం సుబ్రమణ్యదేవాలయం :యానాం శివారు గ్రామం కాపులపాలెం లో సుబ్రమణ్య ఆలయం ఒకటి చాలా ప్రసిద్ధమైనది .ఒకప్పుడు ఒకభక్తుని ఇంట్లో ఒక గదిలో పాము పుట్ట లేచింది . దానిని తవ్వి పారేసాడు . మరలా అక్కడే పుట్ట లేచింది . దానికి తోడు పాము చేరింది . అతను భయపడి ఇల్లు కాళీ చేసి వెళ్లి పోయాడు ఇది జరిగి చాలా సంవత్సరాల క్రితం . అక్కడ యానాం వాస్తవ్యులు శ్రీ మండా సూర్యనారాయణ గారు ఆలయం నిర్మించారు. పుట్ట చుట్టూ మందిరం కట్టించారు . పక్కనే ఆలయం కట్టించారు. ఇప్పటికి రాత్రులు అక్కడ పాము తిరుగుతూ కొందరికి కనిపిస్తూ ఉంటుంది . ఆ పాము వెళ్ళేటపుడు మంచి వేపిన మినుములు వంటి సువాసనలు వెదజల్లుతున్నాయని స్థానికులు చెబుతారు . నాగ దోషం ఉన్న వారు పుట్టదగ్గర అక్కడ పూజలు జరిపించుకోవచ్చు . ప్రతి ఏటా ఇక్కడ షష్ఠికి యానాం వారు భజనలు , పూజలు చేస్తారు .

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...