నీలపల్లి ఆనందాశ్రమం , స్వామి మురుగనంద : ముప్పై ఏళ్ళక్రితం అయన మద్రాస్ లో ఒక టీ దుకాణం దగ్గర కరపత్రం లో పెదబాలయోగిగారి గురించి వివరాలు చూసి ముమ్మిడివరం బాలయోగి గారిని చూడాలని ముమ్మిడివరం చేరుకొన్నారు. ఒక సాధువు గా నీలపల్లి లో ఆనంద్ ఆశ్రమం స్థాపించుకొనిముమ్మిడివరం వీలు దొరికినప్పుడల్లా వెళ్లి వస్తూ ఉండేవారు పుదుచ్చేరి లోని తిరుకాంచి లో సిద్ధార్ పీఠం లో కుండలిని దీక్ష ఒక పున్నమి నాటి రాత్రి తీసుకొన్నారు సాధన ద్వారా కుండలిని ని సాధించుకొన్నారు. కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారం లో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగo . కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.గత 2 నెలలుగా సమాధి స్థితిని పొందగలుగుతున్నారు వయస్సు తొంబై మూడు , ఇంకా సైకిల్ తొక్కుతారు .
ప్రస్తుతం వీరు పుదుచ్చేరిలో తిరుకాంచి లోనే వుంటున్నారు
No comments:
Post a Comment