Monday, May 29, 2017

రాగం : ముఖారి --నానాటి బదుకు నాటకము


రాగం : ముఖారి --నానాటి బదుకు నాటకము కానక కన్నది కైవల్యము


నానాటి బదుకు నాటకము కానక కన్నది కైవల్యము

పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమి పని నాటకము
యెట్ట నెదుట గల దీ ప్రపంచము కట్ట గడపటిది కైవల్యము

కుడిచే దన్నము కోక చుట్టెడిది నడ మంత్రపు పని నాటకము
వొడి గట్టుకొనిన వుభయ కర్మములు గడి దాటినపుడె కైవల్యము

తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము
యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...