Monday, May 29, 2017

నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో


నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో

నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో

మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ
పరమ పురుష భవబంధ విమోచన నరమృగశరీర నమో నమో

జలధిశయన రవిచంద్రవిలోచన జలరుహభవనుత చరణయుగ
బలిబంధన గోపవధూవల్లభ నళినోధ్ధర తే నమో నమో

ఆదిదేవ సకలాగమ పూజిత యాదవకుల మోహనరూప
వేదోద్ధర శ్రీ వేంకటనాయక నాదప్రియ తే నమో నమో

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...