Monday, May 29, 2017

రాగం : సామంతం - నిగమనిగమాంత

రాగం : సామంతం - నిగమనిగమాంతవర్ణిత మనోహర 

నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారయణా

దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యం బియ్య నోపకరా నన్ను నొడబరపుచు
పైపైనె సంసారబంధముల గట్టేవు నాపలుకు చెల్లునా నారాయణా

చికాకుపడిన నా చిత్తశాంతము సేయ లేకకా నీవు బహులీల నన్ను
కాకుసేసెదవు బహుకర్మల బడువారు నాకొలదివారలా నారాయణా

వివివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను భవసాగరముల నడబడ జేతురా
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణా

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...