Monday, May 29, 2017

రాగం : మాళవీ గౌడ -నిత్య పూజలివిగో


రాగం : మాళవీ గౌడ -నిత్య పూజలివిగో 



నిత్య పూజలివిగో నెరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో

తనువే గుడియట తలయె శిఖరమట పెను హృదయమే హరి పీఠమట
కనుగొన చూపులే ఘన దీపములట తన లోపలి అంతర్యామికిని

పలుకే మంత్రమట పాదయిన నాలుకే కలకల మను పిడి ఘంటయట
నలువైన రుచులే నైవేద్యములట తలపులోపలనున్న దైవమునకు

గమన చేష్టలే అంగరంగ గతియట తమి గల జీవుడే దాసుడట
అమరిన ఊర్పులే ఆలబట్టములట క్రమముతో శ్రీ వెంకటరాయునికి

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...