Monday, May 29, 2017

రాగము : ధన్నాసి -పంకజాక్షులు సొలసిపలికి

రాగము : ధన్నాసి -పంకజాక్షులు సొలసిపలికి 

పంకజాక్షులు సొలసిపలికి నగగా నింకా నారగించు మిట్లనే అయ్యా

కలవంటకములు పులుగములు దుగ్ధాన్నములు పలుదెరగులైన అప్పములగములు
నెలకొన్ననేతులును నిరతంపుచక్కెరలు గిలుకొట్టుచును నారగించవయ్యా

పెక్కువగునై దంపుపిండివంటలమీద పిక్కిటిలు మెఱుగుబొడి బెల్లమును
వొక్కటిగ గలుపుకొని వొలుపుబప్పులతోడ కిక్కిరియ నిటు లారగించవయ్యా

కడుమధురమైన మీగడపెరుగులను మంచి అడియాల వూరుగాయల రుచులతో
బడిబడిగ నవకంపు బళ్ళెరంబులతోడ కడునారగించు వేంకటగిరీంద్రా

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...