రాగం : శ్రీ రాగం - పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పడమరలి నవ్వీనె పెండ్లి కూతురు
పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు
బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటె బెండ్లి కూతురు
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి బెరరేచీ నిదివో పెండ్లి కూతురు
పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు
గట్టిగ వేంకటపతి కౌగిటను పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు
No comments:
Post a Comment