Monday, May 29, 2017

రాగం : సాళంగనాట -పెరిగినాడు చూడరో


రాగం : సాళంగనాట -పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు 



పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు

రక్కసుల పాలికి రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు
దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనట్టి ఆకారుడు

లలిమీరిన యట్టి లావుల భీముడు బలు కపికుల సార్వభౌముడు
నెలకొన్న లంకా నిర్థూమధాముడు తలపున శ్రీరాము నాత్మారాముడు

దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపః ఫల పుణ్యుడు
శ్రీవేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...