Monday, May 29, 2017

రాగం : మోహన - పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా

రాగం : మోహన - పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా


పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్య కోనేటి రాయడా

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాల నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువజిత్తములోని శ్రీనివాసుడా

భావింప గైవసమైన పారిజాతమా మమ్ము చేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా మమ్ము తావై రక్షించేటి ధరణీధరా

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగా లడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...