Monday, May 29, 2017

రాగం : ముఖారి --బ్రహ్మకడిగిన పాదము


రాగం : ముఖారి --బ్రహ్మకడిగిన పాదము బ్రహ్మము దానె నీ పాదము



బ్రహ్మకడిగిన పాదము బ్రహ్మము దానె నీ పాదము

చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము

కామిని పాపము కడిగిన పాదము పాముతల నిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము పామిడి తురగపు పాదము

పరమ యోగులకు పరి పరి విధముల వర మొసగెడి నీ పాదము
తిరు వేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...