విన్నానులే వరస :: ఆది తాళం శ్రీ కృష్ణుని పాట
విన్నానులే - విన్నానులే
నీ మహేంద్ర జాలము కన్నానులే కన్నానులే
ఇంటికి మింటికి = జంట లేక
నావంటి దీనుల - పంటల ప్రభువని
నీ మహేంద్ర జాలము కన్నానులే కన్నానులే
ఇంటికి మింటికి = జంట లేక
నావంటి దీనుల - పంటల ప్రభువని
1. విన్నానులే - విన్నానులే
నీదాసుల సేవ చేసేనులే చేసేనులే
దీక్షతో ద్రౌపది తలంచి నంతలో
అక్షయ వలువలు - ఒసగిన ప్రభువని
నీదాసుల సేవ చేసేనులే చేసేనులే
దీక్షతో ద్రౌపది తలంచి నంతలో
అక్షయ వలువలు - ఒసగిన ప్రభువని
2. విన్నానులే - విన్నానులే
నీ దాసుల చేరి వేడేనులే వేడేనులే
పిడికెడు అటుకులు - మెసవి కుచేలుని
అడుగని సిరులిచ్చి- బ్రోచిన ప్రభువని
నీ దాసుల చేరి వేడేనులే వేడేనులే
పిడికెడు అటుకులు - మెసవి కుచేలుని
అడుగని సిరులిచ్చి- బ్రోచిన ప్రభువని
3. విన్నానులే- విన్నానులే
నీ దాసుల పంచలో- ఉన్నానులే ఉన్నానులే
అంచితమగు- నా సంచిత కర్మల
చించి చించి - రక్షించెడి ప్రభువని
నీ దాసుల పంచలో- ఉన్నానులే ఉన్నానులే
అంచితమగు- నా సంచిత కర్మల
చించి చించి - రక్షించెడి ప్రభువని
4. విన్నానులే- విన్నానులే
నీ నామమె గతి యని- పాడేనులే పాడేనులే
శ్రీ వేంకట గురువర - కరుణను బడసిన
లక్ష్మయాఖ్యుని - ఏలిన ప్రభువని
నీ నామమె గతి యని- పాడేనులే పాడేనులే
శ్రీ వేంకట గురువర - కరుణను బడసిన
లక్ష్మయాఖ్యుని - ఏలిన ప్రభువని
No comments:
Post a Comment